బోధన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్.. బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి ఉన్నారు షకీల్. తాజాగా కేబినెట్‌లో కూడా చోటు దక్కకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. ఆయన అరవింద్‌ను కలవడంతో... పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోందంటున్నాయి బీజేపీ వర్గాలు.
ధర్మపురి అరవింద్‌తో, షకీల్ సమావేశం కావడంతో టీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైంది. తెలంగాణలో పాగావేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బీజేపీ.. పలువురు నేతల్ని పార్టీలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. షకీల్.. అరవింద్‌తో భేటీ కావడంతో.. ఆయన కమలం తీర్ధం తీసుకుంటారని భావిస్తున్నారు.
Also watch :