రెండ్రోజులు సమ్మె.. రెండ్రోజులు సెలవులు.. వరుసగా నాలుగు రోజులు..

Update: 2019-09-14 08:20 GMT

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. రెండు రోజుల పాటు ఈ సమ్మె కొనసాగనుంది. ఈ మేరకు యూనియన్ తన ప్రతిపాదనలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు అందజేసింది. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ) పాల్గొననున్నాయి.

ఇటీవల కేంద్రం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ 4 సంస్థలుగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ సెప్టెంబర్ 26 నుంచి 27 అర్థరాత్రి వరకు నిరంతర సమ్మెకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే నవంబర్ రెండవ వారం నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో నాలుగు రోజులు బ్యాంకులు మూసుకోనున్నాయి. 28,29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండడంతో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.

Full View

Similar News