మూడు రోజులుగా నీళ్లలో ఉన్న మృతదేహాలు ఒక్కొక్కటిగా..

Update: 2019-09-17 06:47 GMT

గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మంగళవారం దేవీపట్నంలో 9, ధవళేశ్వరంలో 3 డెడ్‌బాడీలు వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 20 డెడ్‌బాడీల్ని గుర్తించారు. మూడు రోజులుగా నీళ్లలో ఉండిపోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా పాడయ్యాయి. పోస్ట్‌మార్టం పూర్తిచేసి వాటిని బంధువులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద ఇప్పటికే పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్, నేవీ దళాల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కచ్చులూరు నుంచి గండి పోచమ్మ దగ్గర్లో ఉన్న కాఫర్ డ్యామ్ వరకూ కొన్ని టీమ్‌లు గాలిస్తుంటే.. దిగువన ధవళేశ్వరంలో మరికొన్ని బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిన బోటు.. నదిలో 300 అడుగుల లోతులోకి వెళ్లిపోయింది.

Also watch :

Full View

Similar News