మేడారం 'సమ్మక్క-సారక్క' జాతర ముహూర్తం ఖరారు..

Update: 2019-09-20 16:17 GMT

దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ మేరకు మాఘశుద్ధ పౌర్ణమి గడియలను బట్టి తేదీలను మహా జాతర తేదీలను మేడారం జాతర పూజారులు సంఘము ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీనే మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజుల పూజారులు సమావేశమై జాతర నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఇప్పుడు ఆ తేదీలను ప్రకటించారు.

ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.

Similar News