BIG Breaking : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్

Update: 2024-05-02 07:37 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదైంది. కాసేపటి క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీపీఎస్‌కు తరలించారు.

కాగా రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్‌’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్‌లో కోరింది. 

Full View

Tags:    

Similar News