నిర్మాణ దశలోనే కూలిన బ్రిడ్జి..

Update: 2019-09-20 06:25 GMT

సిరిసిల్ల వేములవాడ జిల్లాలో మూలవాగుపై నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలిపోయింది. వరద ఉధృతికి ఒక్కసారిగా పిల్లర్లు పక్కకు ఒరిగిపోయాయి. వీటికి సపోర్ట్‌గా ఉంచిన సెంట్రింగ్ కూడా కొట్టుకుపోయింది. కొన్నాళ్లుగా ఈ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మధ్యలో నిధుల్లేక ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మూలవాగు ప్రవాహానికి ఏకంగా పాక్షికంగా కూలిపోవడం కలకలం రేపుతోంది.

కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. 22 కోట్లతో మొదలైన పనులు నెలల తరబడి సాగుతున్నాయని.. సరైన పర్యవేక్షణ లేని కారణంగా బ్రిడ్జి భద్రతపైనే అనుమానాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also watch :

Full View

Similar News