హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం - కేటీఆర్

Update: 2019-09-25 15:39 GMT

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ అని.. బీజేపీది థర్డ్‌ప్లేస్ అని చెప్పారు. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తువల్ల ప్రజలు కన్‌ఫ్యూజ్ అయ్యారని లేదంటే టీఆర్ఎస్సే గెలిచేదని తెలిపారు. హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్‌ చేస్తామని చెప్పారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లాభమని.. అదే టీఆర్ఎస్‌ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభమని చెప్పారు కేటీఆర్. అధికారంలో ఉంది టీఆర్ఎస్‌ కాబట్టి.. ఎవర్ని గెలిపించాలో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని తెలిపారు. తమ అభ్యర్థి సైదిరెడ్డిపై ప్రజల్లో సింపతి ఉందని అన్నారు. హుజూర్‌నగర్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని.. ఎవరైనా సపోర్ట్ చేస్తామని ముందుకువస్తే కలుపుకొని పోతామని చెప్పారు కేటీఆర్.

Also watch :

Full View

Similar News