పసిడి ధరకు బ్రేకు.. 22 క్యారెట్ల బంగారం ధర..

Update: 2019-09-27 04:39 GMT

బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. గత వారం రోజుల పసిడి ధరలను పరిశీలిస్తే పోయిన వారం కంటే ఈ వారం మరి కొంత తగ్గి కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా రూ.400 తగ్గి రూ.39,250కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గుదలతో రూ.35,970కు పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీ వెండి ధర రూ.50,050కు క్షీణించింది. అదే ఢిల్లీ మార్కెట్లో అయితే పది గ్రాముల బంగారం 24 క్యారెట్లు ఉన్నది రూ.400 తగ్గి రూ.37,950కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,750కి క్షీణించింది. అక్కడ కూడా పసిడి ధరతో పాటే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెడ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరల పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది.

Full View

Similar News