తెలంగాణలో సమ్మె సరైన్ మోగింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకోడానికి అత్యవసరంగా సమావేశమైన కార్మిక సంఘాలు.. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.
ఇప్పటి వరకు సమ్మె నోటీసులకు యాజమాన్యం నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకున్నాయి కార్మిక సంఘాలు. తమతో కనీసం సంప్రదింపులు జరపకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా లేబర్ కమిషనర్‌తో చర్చలకు ఆహ్వానించడాన్ని తప్పు పడుతూ.. సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించారు.
Also watch :