హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.. పార్టీ అభ్యర్థిని సస్పెండ్ చేసిన సీపీఎం నాయకత్వం
హుజూర్‌నగర్‌లో సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై పార్టీ స్టేట్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులుగా పార్టీ అభ్యర్థి శేఖర్ రావుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. CPM పార్టీ జిల్లా కార్యదర్శి రాములును కూడా బాధ్యతల నుంచి తప్పించారు. ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఎంను కోరింది తెలుగుదేశం. ఇందుకు ఒప్పుకోని సీపీఎం.. తెలంగాణ ప్రజాపార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.