Jana Nayagan Postponed : జన నాయగన్ పోస్ట్ పోన్ అవుతోందా..?

Update: 2026-01-07 12:06 GMT

దళపతి విజయ్ హీరోగా నటించిన మూవీ జన నాయగన్. ఈ మూవీ విడుదలకు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్నాయి. ముందు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదు. తర్వాత కోర్ట్ వరకు వెళ్లింది ప్రొడక్షన్ హౌస్. కోర్ట్ లో ఈ కేస్ ను ఈ నెల 9కి వాయిదా వేసింది. అదే రోజు విడుదలవుతోంది మూవీ.దీన్ని బట్టి ఇన్ డైరెక్ట్ గా మూవీ వాయిదా పడినట్టే కదా అంటున్నారు. మరో కీలకమైన విషయం ఏంటంటే.. సెన్సార్ నుంచి 27 కట్స్ చెప్పారట. మమూలుగా యాక్షన్ మూవీస్ లో ఇన్ని కట్స్ ఎలా సాధ్యం. అదే టైమ్ లో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ పై కూడా కట్ చేయాలని చెప్పారు. దీంతో పాటు కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాలని కూడా చెప్పింది సెన్సార్ బోర్డ్. ఈ బోర్డ్ మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది.

విజయ్ ఈ మూవీ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆ కారణంగానే ఈ మూవీని ముందు నుంచీ ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. 90శాతం వరకు ఈ మూవీ ఈ నెల 9నే విడుదల కావడం సాధ్యం కాదు అంటున్నారు. అంటే ఈ నెల 10 లేదా 11నే రిలీజ్ కాబోతోందని చెప్పొచ్చు. పైగా అన్ని కట్స్ వరకు వెళ్లడం కంటే రివైజింగ్ కమిటీకి వెళితే మాత్రం ఇంకా ఆలస్యం అవుతుంది. మొత్తంగా ఈ మూవీ రిలీజ్ డేట్ మాత్రం మారబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.

విజయ్ తో పాటు బాబీ డియోల్, పూజాహెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించిన మూవీ ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఫస్ట్ మూవీ. 

Tags:    

Similar News