రాముడు, లక్ష్మణుడు, సీత.. రామాయణ గాథలోని ముఖ్య పాత్రలు. భర్త రాముడి మనసెరిగిన భార్య సీత.. అన్న అడుగు జాడల్లో నడుచుకునే తమ్ముడు లక్ష్మణుడు. పినతల్లి ఆజ్ఞానుసారం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి బయలు దేరిన రామునితో అర్ధాంగి సీత, తమ్ముడు లక్ష్మణుడు బయలుదేరి వెళతారు. అణకువగా ఉండే సీత అరణ్యంలో కంద మూలాలు తింటూ భర్తకు సపర్యలు చేస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరవశించి పోతుంది. అయిన వారు పక్కనే ఉన్నారన్న భరోసాతో అరణ్యవాసాన్ని ఆనందంగా స్వీకరిస్తుంది. ఈ ఘట్టానికి సంబంధించిన ఆ పాత్రలన్నీ చిన్నారులు చేస్తే ఇంకా ముద్దుగా ఉంటుంది. ఓ స్కూల్లో జరిగే ఫంక్షన్లో చిన్నారులు తమ అభినయాన్ని ప్రదర్శించారు. కానీ ఇక్కడ చిన్నారి సీత పక్కనే రాముడు, లక్ష్మణుడు ఉన్నారనే విషయాన్ని మరిచి పోయి తనకు ఇష్టమైన పాట వినిపిస్తుంటే లయ బద్దంగా అడుగులు వేసింది. సీతమ్మ క్యూట్ స్టెప్పులకు నెటిజన్లు పరవశించి పోతున్నారు. బుజ్జి బంగారు.. భలే ఉన్నావు తల్లి.. అంటూ ముద్దులు కురిపిస్తున్నారు.
Why maa Sitha so happy ??? 😍😍😍 pic.twitter.com/cfes0SH6pi
— Subash இனி (@swamisaranamm) October 12, 2019