ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఐదుగురు మరణించారు. మరో 77 మంది గాయపడ్డారు. కీలాల పట్టణంలో 17 మంది, తులునాన్ పట్టణంలో మరో 60 మంది గాయాల పాలయ్యారు. భూప్రకంపనలతో ఫిలిప్పీన్స్ ప్రజలు హడలిపోయారు. భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర కొటబాటో ప్రాంతంలో భూకంపం సంభవించిది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. మకీలాలా పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.