ESI స్కామ్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న పద్మ ఆత్మహత్యాయత్నం

Update: 2019-10-19 14:51 GMT

చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ESI స్కామ్ లో పద్మ పట్టుబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపం చెంది మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఆమెకు ఉస్మానియా జనరల్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఒంట్లో బాగోలేదని శనివారం మధ్యాహ్నం ఆమెకు జైలు అధికారులు కొన్ని మాత్రలు అందించినట్టు సమాచారం. అయితే ఆ మాత్రలను ఆమె ఒకేసారి వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

కాగా ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Similar News