బ్యాట్ పట్టి షాట్లు కొడుతూ సందడి చేసిన రాహుల్ గాంధీ

Update: 2019-10-19 07:34 GMT

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సరదాగా క్రికెట్ ఆడారు. నెట్స్‌ మధ్య బ్యాట్ పట్టి షాట్లు కొడుతూ సందడి చేశారు. శుక్రవారం హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఎన్నికల

ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో రాహుల్ ఇలా రిలాక్స్ అయ్యారు. బహిరంగ సభ తర్వాత హెలికాఫ్టర్‌లో తిరిగి ఢిల్లీ వెళ్తున్నప్పుడు ప్రతికూల వాతావరణం వల్ల

చాపర్‌ను రివారీలోని కేఎస్సీ కాలేజ్ గ్రౌండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాసేపు అక్కడే ఉండాల్సి రావడంతో రాహుల్ మైదానంలో ఉన్న కుర్రాళ్లను కలిసారు. సరదాగా

వారితో క్రికెట్ ఆడారు. తర్వాత అక్కడి పిల్లలతో కాసేపు మాట్లాడారు. రాహుల్ క్రికెట్ ఆడుతున్న ఈ దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీకి 100 కిలోమీటర్ల

దూరంలో ఈ రివారీ ప్రాంతం ఉంటుంది. హెలికాఫ్టర్‌లో తిరిగి బయలుదేరే పరిస్థితి లేకపోవడంతో చివరికి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ ఢిల్లీ చేరుకున్నారు.

Similar News