కల్కి ఆశ్రమంలో భారీగా నోట్ల కట్టలు.. రూ. 800 కోట్లు..

Update: 2019-10-21 11:22 GMT

చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. 800 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను లెక్కల్లో చూపలేదని గుర్తించారు. ఆశ్రమంలో దొరికిన స్వదేశీ, విదేశీ కరెన్సీ కట్టలు చూసి ఐటీ అధికారులే షాక్‌ అయ్యారు. అంత పెద్ద మొత్తాన్ని క్యాష్‌ రూపంలో దగ్గర పెట్టుకున్నారు కల్కి భగవాన్, ఆయన భార్య అమ్మ భగవాన్.

కల్కి ఆశ్రమంలో నాలుగు రోజులు ఐటీ అధికారులు సోదాలు జరిగాయి. 44 కోట్ల రూపాయల నగదు, 40 కేజీల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. 20 కోట్లు విలవైన ఫారిన్‌ కరెన్సీని సీజ్‌ చేశారు. 4వేల ఎకరాల స్థలాలు గుర్తించారు. హవాలా లావాదేవీలు జరిగినట్టు ఐటీ అధికారులు స్పష్టంచేశారు.

దేశంలోనే కాదు.. విదేశాల్లోను కల్కి భగవాన్‌కు ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దుబాయ్‌, ఆఫ్రికా, బ్రిటిష్ వర్జిన్‌ ఐలాండ్‌లో ఆయన పెట్టుబడులు ఉన్నట్టు తేల్చారు. అయితే.. వాటిని లెక్కల్లో చూపలేదు. వాటి విలువ 100 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు.

Similar News