పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పడిపోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఐతే, వైద్య పరీక్ష ల్లో ఆయనకు డెంగ్యూ లేదని బయటపడింది. అనారోగ్య సమస్యల కారణంగానే ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పడిపోయిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రో జుల పాటు ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం నవాజ్ షరీఫ్‌కు చికిత్స అందిస్తోంది.
చౌదరి షుగర్ మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ఎన్ఏబీ కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు ఆయన కోట్ లక్‌పత్ జైల్లో ఉన్నారు. ఇటీవల షరీఫ్ వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్, షరీఫ్‌ను కలుసుకున్నారు. ఆ సమయంలోనే షరీఫ్ అనారోగ్యం బయటపడింది. దాంతో ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం షరీఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.