ఫ్లైయింగ్ టాక్సీ వచ్చేసింది. సింగపూర్‌లో ఎగిరే టాక్సీ చక్కర్లు కొట్టింది. రెండు రోజుల క్రితం ఎగిరే టాక్సీని ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. రెండు సీట్లు ఉండే ఈ ట్యాక్సీని జర్మన్ కంపెనీ వోలోకాప్టర్ అభివృద్ధి చేసింది.
ఆధునిక యుగంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించడానికి ఫ్లైయింగ్ టాక్సీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.