ఆంధ్రా బ్యాంక్ 'గోల్డ్' స్కీమ్.. బయటి కన్నా బంగారం 2,000 తక్కువకే..

Update: 2019-10-24 06:39 GMT

ఆంధ్రాబ్యాంక్ తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2019-20 సిరీస్ 6 స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దగ్గరిలోని బ్రాంచ్‌కు వెళ్లి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈనెల 25 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గ్రాము బంగారం ధర రూ.3,835 ఉంది. డిజిటల్ మార్గంలో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు గ్రాము బంగారం రూ.3,785కే వచ్చేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కలిగిన ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే డైరెక్ట్‌గా గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల పేరుపై కూడా బాండ్లు తీసుకోవచ్చు.

ఓ వ్యక్తి కనీసంగా 1 గ్రాము బంగారం మొదలు 4 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదే ట్రస్ట్‌లు కానీ ఇతర సంస్థలు లాంటివి అయితే ఏకంగా 20 కేజీల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్ల మెచ్యూరిటీ 8 ఏళ్లు. అంటే ఎనిమిదేళ్ల తరువాత బాండ్లను వెనక్కు ఇచ్చేసి డబ్బులు తీసుకోవచ్చు. ఐదేళ్ల తరువాత కూడా అవసరం అనుకుంటే బాండ్లను వెనక్కు ఇచ్చేసి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ బాండ్లపై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ అకౌంట్లో జమ అవుతుంది. బయట గోల్డ్ షాపుల్లో బంగారం ధర పది గ్రాములు సుమారు 40 వేలు వుందనుకుంటే, అదే ఆంధ్రాబ్యాంకులో గోల్డ్ స్కీమ్ ద్వారా అయితే 10 గ్రాముల ధర రూ.37,850 అవుతుంది.

Similar News