కారు కొనాలనుకుంటున్నారా అయితే ఛలో ఎస్‌బీఐ..

Update: 2019-10-24 05:33 GMT

అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తోంది. అందులో వెహికల్ లోన్స్ ప్రత్యేకమైనవి. ఎస్‌బీఐ న్యూకార్ లోన్, ప్రిఓన్‌డ్ కార్ లోన్, లాయల్టీ కార్ లోన్, సూపర్‌ బైక్ లోన్, అస్యూర్డ్ కార్ లోన్, కార్ లోన్ లైట్, టూవీలర్ లోన్ వంటి పలు రకాల రుణాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో ఎస్‌బీఐ అస్యూర్డ్ కార్ లోన్ గురించి చూద్దాం..

ఈ స్కీమ్ కింద రూ.2లక్షలు నుంచి రుణం పొందొచ్చు. 18 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 9.5 శాతం మధ్యలో ఉంది. క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ వంటి పలు అంశాల ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతుంది. తీసుకున్న రుణాన్ని 3 నుంచి 7 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగున్నట్లయితే వడ్డీ రేటులో కొంత తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది. 750కు పైన సిబిల్ స్కోర్ ఉన్న వారికి వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం కావొచ్చు. 3 నుంచి 5 ఏళ్ల లోన్ టర్మ్‌కు ఇది వర్తిస్తుంది.

ఇక ఈలోన్ పొందాలంటే ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ డాక్యుమెంట్లతో దగ్గరిలోని ఎస్‌బీ బ్రాంచ్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

Similar News