మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్‌పై విడుదలై బెంగళూర్‌కు వచ్చారు. ఆయనకు ఢిల్లీ హై కోర్టు అక్టోబరు 23న బెయిల్ మంజూరు చేసింది. 25 లక్షల రూపాయల వ్యక్తిగత పూచికత్తు.. ఇద్దరు వ్యక్తులు ష్యూరిటీపై డీకే శివకుమార్ ను విడుదల చేసింది కోర్టు. సుమారు 50 రోజుల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన డీకే శివకుమార్‌కు ఘన స్వాగతం పలికారు ఆయన అభిమానులు.
అభిమానులంతా తమ భుజాలపైకి శివ కుమార్‌ను ఎక్కించుకుని ఊరేగించారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల హర్షద్వానాల మధ్య శివకుమార్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శివకుమార్ సరికొత్త లుక్‌తో ఆకర్షిస్తున్నారు.