తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్... రాజ్‌భవన్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె తెలుగులో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా గవర్నర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
దీపావళి వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఎన్నో వినతులు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్ నిషేధించామన్నారు గవర్నర్. ప్లాస్టిక్ కుండీలతో వచ్చిన సందర్శకులను మరోసారి మట్టి కుండీలతో రావాలని సూచించారు. త్వరలోనే గిరిజన ప్రాంతాలను సందర్శిస్తానన్నారు.