ప్రకాశం జిల్లా పర్చూరులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశం గందరగోళానికి దారితీసింది. దగ్గుబాటి నిష్ర్కమిస్తున్నట్లు ప్రచారంతో ఇన్‌చార్జీ పదవి ఎవ్వరి ఇవ్వాలన్న విషయంలో వాదోపవాదనలు , తోపులాటలు చోటు చేసుకున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రావి రామనాధం బాబుకు ఇన్‌చార్జి పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కొంతమంది నేతలను వేదికపైకి పిలవలేదన్న కారణంతో వైసీపీలోని రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో సమావేశం రసబాసగా మారింది. దీంతో వైసీపీ ఇన్‌చార్జీ పదవి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో.. ఆయన భార్య పురంధేశ్వరి బీజేపీలో కొనగసాగతుండటంతో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని సీఎం జగన్ దగ్గుబాటికి సూచించారు. దీంతో పర్చూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్‌చార్జి పదవి కోసం పర్చూరులో రగడ మొదలయ్యాయి.
ఎన్నికల ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పి తిరిగి ఇప్పుడు వైసీపీలో చేరిన రామనాధం బాబుకు ఇన్‌చార్జి పదవి ఎలా ఇస్తారంటూ కార్యకర్తల ప్రశ్న. 2014 ఎన్నికల్లో పోటీ చేసి అనంతరం ఇన్‌చార్జిగా పనిచేసిన గొట్టిపాటి భరత్‌కి తిరిగి బాధ్యతలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అలా కాదని ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించిన రావికి బాధ్యతలు అప్పగిస్తే తీవ్ర నష్టం తప్పదని కార్యకర్తలు, నేతలు హెచ్చరిస్తున్నారు. అటు దగ్గుబాటికే ఇన్‌చార్జీ బాధ్యతలు ఇవ్వాలంటూ దొప్పలపూడి సుబ్బారావు అనే వైసీపీ కార్యకర్త పురుగుల మందు తాగతాడినికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.