చికాగోలో 9వ రోజుకు చేరిన ఉపాధ్యాయుల సమ్మె

Update: 2019-10-29 12:18 GMT

అమెరికాలోని చికాగోలో టీచర్స్ చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. వేలాది మంది ఉపాధ్యాయులు ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్లపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని నినదించారు. తరగతి గదుల పరిమితి, సిబ్బందికి తగిన వేతనాలు, పాఠశాలల్లో సరైన వనరులు సమకూర్చాలంటూ గత కొద్దిరోజులుగా నిరసన బాటపట్టారు. అమెరికాలోని మూడవ అతిపెద్ద విద్యా నగరంగా ప్రసిద్ది చెందిన చికాగోలో వేలాదిమంది ఉపాధ్యాయులు క్లాసులను బహిష్కరించి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 25 వేలమంది ఉపాధ్యాయులు కల్గిన ఉన్న చికాగో టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

Similar News