గన్నవరం నియోజకవర్గనేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

Update: 2019-10-31 12:00 GMT

వల్లభనేని వంశీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే తప్పుడు ఫోర్జరీ కేసు పెట్టారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గనేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఇంఛార్జ్‌ లేకుండానే సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రసగించిన చంద్రబాబు.....వల్లభనేని వంశీ తప్పుడు కేసులకు భయపడి వల్లభనేని వంశీ.... జగన్‌ వద్దకు వెళ్లాడన్నారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 43 వేల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి పెట్టించే తప్పుడు కేసులకు భయపడాలా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఒత్తిళ్లకు భయపడితే.. ఇంకేమి చేయలేమని, తప్పుడు కేసులకు భయపడితే.. ఓ రౌడీకి రాష్ట్రాన్ని అప్పగించినట్లేనన్నారు చంద్రబాబు. ఇదే జరిగితే రాష్ట్రం మరో బీహార్‌లా మారుతుందన్నారు. పిరికితనం మంచిది కాదని వంశీ... మరోసారి సూచిస్తున్నట్లు తెలిపారు. మన ఎమ్మెల్యేలను లాక్కుంటే... తాను భయపడతానని జగన్‌ భావిస్తున్నాడని, ప్రజలతో ఉండే తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు.

Similar News