జార్ఖండ్ లో మోగిన ఎన్నికల నగారా

Update: 2019-11-01 12:40 GMT

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ శాసనసభ గడువు జనవరి 5న ముగియనుంది. మొత్తం 5 దశల్లో జార్ఘండ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 6న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్‌ 30న తొలిదశ, డిసెంబర్‌7న రెండోదశ, డిసెంబర్12న మూడో దశ, డిసెంబర్16న నాలుగో దశ, డిసెంబర్20న తుది దశ ఎన్నికలు

జరగనున్నాయి. డిసెంబర్‌ 23న కౌంటింగ్ ఉంటుంది.

2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీ భాగస్వామ్య పక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 5 సీట్లు గెలుచుకుంది. 81 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 41 మంది సభ్యుల బలం దాటడంతో బిజేపీ సర్కార్ ఏర్పాటైంది. 2014 డిసెంబర్ 28న రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం జార్ఖాండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరారు.

Similar News