దేశంలో టెర్రరిజాన్ని సహించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. 1992లో విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఉగ్రవాదులు కాల్పి చంపారని.. ఆ కేసులో దోషులను వదిలి వేయడం బాధాకరమన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి పరామర్శించారు.