కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు డెంగ్యూ సోకింది. మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో గడిపి ఇటీవలే బెయిలుపై విడుదలైన డీకే.. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన శేషాద్రిపురం అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు, సన్నిహితులు
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రెండు నెలల పాటు తీహర్ జైలులో గడిపిన శివ కుమార్.. ఐదు రోజుల క్రితమే బెంగళూరు వచ్చారు. ఈ సమయంలో ఆయన డెంగ్యూబారిన పడడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజులుగా జ్వరం, వెన్ను నొప్పితో బాధపడుతున్న డీకే శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు జరిపిన వైద్యులు డెండ్యూ జ్వరంగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావొద్దని... తాను ఆరోగ్యంతోనే ఉన్నానని ప్రకటించారు డీకే శివకుమార్.