మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వేగంగా పావులు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షాతో ఫడ్నవీస్ భేటీ అయ్యారు. శివసేనతో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పంపకంపై కీలక చర్చలు జరిగాయి. మరోవైపు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై శరద్ పవార్ కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం సోనియా గాంధీతో పవార్ భేటీ కానున్నారు. శివసేనను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే అంశంలో కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు కొనసాగిస్తున్నాయి.