తమిళనాడు బోరుబావి ఉదంతం మరిచిపోకముందే మరో ఘోరం

Update: 2019-11-05 09:42 GMT

తమిళనాడు బోరుబావి ఉదంతం మరిచిపోకముందే హర్యానాలో మరో ఘోరం జరిగింది. కర్నాల్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి మృతి చెందింది. హర్‌సింగ్‌పురా గ్రామానికి చెందిన పాప, ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతకగా బోరుబావిలో పడినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులు, అధికారులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాపను కాపాడడానికి చర్యలు చేపట్టారు. ఐతే, బాలికను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావిలోనే పాప ప్రాణాలు వదిలింది.పాప మృతితో ఆమె కుటుంబం కన్నీరు మున్నీరైంది. అల్లారముద్దుగా పెంచుకున్న కూతురు, కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News