దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

Update: 2019-11-05 14:00 GMT

సీబీఐ మరోసారి జూలు విదిల్చింది. దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 169 చోట్ల తనిఖీలు నిర్వహించింది. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీల్లో తనిఖీలు చేపట్టారు. వందలమంది సీబీఐ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

బ్యాంకులను మోసం చేసిన కేసులకు సంబంధించి సీబీఐ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. 7 వేల కోట్ల రూపాయల విలువ చేసే బ్యాంకు మోసాలపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి 35 కేసులు నమోదు చేశారు. ఐతే, బ్యాంకుల వివరాలు మాత్రం వెల్లడించలేదు. బ్యాంకుల మోసాల విషయంలో సీబీఐ గతంలో కూడా దేశవ్యాప్తంగా పలుమార్లు సోదాలు నిర్వహించింది.

Similar News