మీ కలలను నిజం చేస్తుంది ఎస్‌బీఐ. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణం తీసుకోవాలనుకుంటే రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఎన్‌ఆర్‌ఐలు ఎస్‌బీఐ ప్రాపర్టీ లోన్ తీసుకోవచ్చు. అయితే నెలకు నికర వేతనం రూ.25,000 ఉండాలి. అప్పుడయితేనే లోన్ తీసుకోవడానికి అర్హులవుతారు. 70 ఏళ్ల వయసు వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రాపర్టీని లొకేషన్ ఆధారంగా లెక్కకడుతుంది బ్యాంకు. దీన్ని బట్టి రూ.5 కోట్ల వరకు కూడా రుణం రావచ్చు. అయితే తీసుకున్న రుణాన్ని 15 ఏళ్లలోగా తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ప్రాపర్టీ రుణాలపై లోన్ మొత్తంలో 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. దీనికి ఇతర సర్వీస్ చార్జీలు అదనంగా ఉంటాయి.