తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులకు బెదిరింపులు పెరిగిపోయాయి. తాజాగా కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తాడ్వాయికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి.. తహసీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. భూవివాదంలో వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో ఆర్డీఓకు హెడ్ కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో.. భయాందోళనకు గురైన ఆర్డీఓ రాజేంద్ర కుమార్.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.