గిరిజన ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ ISBలో చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంట్రపెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీంకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. వంద మంది గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గిరిజన యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలవల్లే ఎక్కువగా ఉద్యోగాలొస్తాయన్నారు కేటీఆర్. ప్రతి పారిశ్రామిక పార్కులోనూ రిజర్వేషన్లున్నాయని కేటీఆర్ అన్నారు.