వావ్ ఇస్మార్ట్.. ఎంత స్మార్ట్‌గా ఉందో..

Update: 2019-11-09 06:54 GMT

స్మార్ట్ పీపుల్ కోసం ఇస్మార్ట్ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మోటారు వాహన తయారీ కంపెనీలు భారత స్టాండర్డ్ 6 ప్రమాణాలతో కొత్త బండ్లను తీసుకువస్తోంది. హీరో మోటోకార్స్ తాజాగా తన పాపులర్ మోడల్ స్ప్లెం డర్‌ను బీఎస్ 6 తో ఆధునీకరించి ismart పేరుతో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన Splendor మోటార్ సైకిల్ లేటెస్ట్ మోడల్ ఇది. మన దేశంలో BS6 ఇంజిన్ ఉన్న తొలి మోటార్ సైకిల్ ఇదే అని కంపెనీ చెబుతోంది. దీని ధర ఢిల్లీలో (ఎక్స్-షోరూం) రూ.64,900.

ఫీచర్లు..

కొత్త డైమండ్ ఫ్రేమ్‌తో వచ్చిన ఈ బైక్ రెడ్, బ్లాక్, టెక్నో బ్లూ, సిల్వర్, హెవీ గ్రే రంగులో లభిస్తోంది. సెల్ఫ్ డ్రామ్ క్యాస్ట్, సెల్ఫ్ డిస్క్ క్యాస్ట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 116 కిలోలు, స్పోర్ట్స్ 9.5 లీటర్ (ఫ్యూయల్ ట్యాంక్), 240mm డిస్క్ బ్రేక్ (ఫ్రంట్), Fi స్లాండ్.. 9 bhp @7500 rpm, 9.89 Nm torque @ 5500 rpm, 110cc BS6 కంప్లయింట్ ఫ్యుల్ ఇంజెక్టడ్ ఇంజిన్ 130mm డ్రమ్ బ్రేక్ (రియర్- బ్యాక్), 80/100-18 ట్యూబ్ లెస్ టైర్స్ ఇతర ఫీచర్లు.

Similar News