వేటుపడ్డ ఎమ్మెల్యేలకు ఊరట

Update: 2019-11-13 06:10 GMT

 

కర్నాటకలో ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే.. ఐదేళ్లపాటు అసెంబ్లీ కాల పరిమితి ముగిసే వరకు కాకుండా.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. వారిలో 12 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. మరో ముగ్గురు జేడీఎస్ సభ్యులు కాగా.. ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. అయితే.. వాళ్లు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

డిసెంబర్‌ 5న కర్నాటకలో ఉప ఎన్నికలు జరుగుతాయి. వాటిలో తాము కచ్చితంగా పోటీ చేస్తామని.. గెలుస్తామని అనర్హత ఎమ్మెల్యేలు అంటున్నారు.

Similar News