ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది AICC. రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కిశఓరీ లాల్ శర్మను రంగంలోకి దించింది AICC. అయితే.. ఈసారి కూడా లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు ప్రియాంక గాంధీ. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి యూపీ వెళ్లారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వాయనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వాయ్ నాడ్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాయ్ బరేలీ సీటు కాంగ్రెస్ కు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు AICC మాజీ చీఫ్ సోనియాగాంధీ. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న సోనియా... రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఐతే రాయ్ బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈ సీటు నుంచి రాహుల్ పేరును ప్రకటించింది AICC.