జిల్‌లో 11వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్-చైనా సంబంధాలు మరింత బలోపేతం దిశగా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు ప్రధాని మోదీ తెలిపారు. చెన్నైలో జరిగిన సమావేశం తర్వాత మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధానికి కొత్త దిశను, శక్తిని ఇచ్చిందని తాము నమ్ముతున్నాని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ఎటువంటి ఎజెండా లేకుండా, తాము ఇరుదేశాల మధ్య సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై చర్చించుకున్నామని తెలిపారు.