ఇంటికి వచ్చి వంట చెసి పెట్టవూ.. మా ఆవిడ లేదు.. స్టూడెంట్‌కి ఫ్రొఫెసర్ కాల్

Update: 2019-11-15 10:17 GMT

ఈ పాఠం అర్థం కాలేదా.. అయితే ఇంటికి రా బా..గా అర్థం అయ్యేలా చెబుతా అంటూ స్పెషల్ క్లాసుల పేరుతో లైగింక వేధింపులకు గురిచేసే ఫ్రొఫెసర్ల గురించి వింటున్నాము. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫ్రొఫెసర్ మరికొంత అడ్వాన్స్ అయ్యి.. కాస్త వచ్చి వంట చేసి పెట్టకూడదు.. మా ఆవిడ ఊళ్లో లేదు. ఇద్దరం కలిసి తినొచ్చు.. అని స్టూడెంట్‌కి కాల్ చేశాడు. అర్థరాత్రి సమయంలో ఈ కాలేంటి అని కంగారు పడి డిస్ కనెక్ట్ చేస్తే మెసేజ్ చేసి మరీ రమ్మని పిలిచాడు. ఉత్తరాఖండ్ జీబీ పంత్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ వర్సిటీ విద్యార్ధినికి అర్థరాత్రి ఫోన్ చేయడం సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్ కూడా అయిన ఫ్రొఫెసర్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకు వెళ్లింది విద్యార్థిని. అయితే అతడిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర గవర్నరు బేబి రాణి మౌర్య దృష్టికి రావడంతో ఆమె దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యుడైన ఫ్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వీసిని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం వర్సిటీ ఫ్రొఫెసర్‌ని వార్డెన్ పోస్టు నుంచి తొలగించినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఏపీ శర్మ తెలియజేశారు. ఇకపై యూనివర్శిటీలో ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూసుకుంటామని వివరించారు.

Similar News