మళ్లీ ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముంది : ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
కార్మికులతో చర్చలు జరపబోము.. డిమాండ్లు పరిష్కరించలేం అంటూ ఆర్టీసీ సమ్మెపై ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి యూనియన్ నేతలు విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినా.. మళ్లీ ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని గుర్తు చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీకి 44శాతం నష్టం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగులేకపోవడంతో.. కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమన్నారు. కేవలం కొందరు యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నందన.. ఈ సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలని సునీల్ వర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. యూనియన్ నేతల స్వార్థం కోసం చేసే ఈ సమ్మె కారణంగా ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని.. అందుకే సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని కోరుతూ ఆయన తుది అఫిడవిట్ దాఖలు చేశారు.