ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు , రాళ్లులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడిలో పలువురు తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. గాయ పడినవారిని ఆస్పత్రికి తరలించారు. ల్యాండ్ విషయంలో ఈ వివాదం తలెత్తిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల్ని మోహరించారు.