మిస్ దివా 2020 అందాల పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మిస్ దివా టైటిల్ దక్కించుకునేందుకు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హయత్ హోటల్‌లో నిర్వహించిన ఈ అందాల పోటీలలో 70 మంది పోటీ పడగా.. 12 మంది యువతులు ఎంపిక చేశారు. హైదరాబాద్‌తో పాటు మరో తొమ్మిది నగరాల్లో పోటీలు నిర్వహించిన తర్వాత ఫైనల్స్ ముంబైలో జరుగనున్నాయి. ఈ అందాల పోటీల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది