హైకోర్టు నుంచి సమ్మె అంశం లేబర్ కోర్టుకు మారడంతో.. ఆర్టీసీ కార్మికులు ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై దృష్టి పెట్టారు. నెలన్నర గడిచిపోయినా ఆర్టీసీ సమ్మె ఇప్పటికీ కొలిక్కిరాడం లేదు. సమ్మె చట్టవిరుద్ధమని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో ఇకపై విచారణ లేబర్ కోర్టుకు మారుతోంది. చర్చలకు సర్కారు కూడా సముఖంగా లేకపోవడం, రెండు నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. JAC నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
సమ్మె కొనసాగించాలా.. వాద్దా.. కొనసాగిస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి.. అన్న అంశాలపై ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. ఎల్‌బి నగర్‌లోని హిమగిరి గార్డెన్స్‌లో అశ్వత్థామ రెడ్డి అధ్యక్షతన టిఎమ్‌యు యూనియన్ 97 డిపోలకు చెందిన అధ్యక్షులు, సెక్రటరీ, గ్యారేజ్ సెక్రటరీలతో సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు.