మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఊరట లభించింది. ఫడ్నవిస్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. పైగా, పిటిషనర్‌కే హైకోర్టు రివర్స్ షాక్ ఇచ్చింది. వాస్తవాలు నిర్దారించుకోకుండా, ఓ వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారంటూ పిటిషనర్‌కు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈనెల 29లోపు జరిమానా కట్టాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
ఫడ్నవిస్ ఎన్నికను సవాల్ చేస్తూ సురేష్ రంగారీ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఫడ్నవిస్‌పై వార్దా జిల్లాలో అట్రాసిటీ కేసు నమోదైందని ఆరోపించాడు. ఆ కేసు వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పకుండా దాచి పెట్టారని తెలిపాడు. వాస్తవాలను దాచి పెట్టినందుకు ఫడ్నవిస్‌ను అనర్హునిగా ప్రకటించాలని కోరాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం, సురేష్ రంగారీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనలో పసలేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.