హాంకాంగ్‌లో హోరెత్తుతున్న ఆందోళనలు

Update: 2019-11-19 16:29 GMT

హాంకాంగ్ అట్టుడికిపోతోంది. సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులు హింసాత్మకచర్యలకు తెగబడ్డారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకారులను నిర్బంధించారు. ఇక, పోలీసుల నిర్బంధం నుంచి

నిరసనకారులు నాటకీయంగా తప్పించుకున్నారు. ముసుగులు ధరించి తాళ్ల సాయంతో యూనివర్సిటీ బిల్డింగ్‌ పైనుంచి కిందికి దిగారు. అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న బైక్‌లపై పారిపోయారు. ఇది జరిగిన కాసేపటికే వేల సంఖ్యలో ఆందోళనకారులు పాలిటెక్నిక్‌ యూనివర్శిటీవైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య

ఘర్షణలు చెలరేగాయి.

నేరస్థుల అప్పగింత బిల్లు హాంకాంగ్‌లో చిచ్చు రేపింది. చైనా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తూ లక్షలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతబడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనలను సహించే ప్రసక్తే లేదని చైనా హెచ్చరించింది. అవసరమైతే సైన్యాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఈ బెదిరింపులతో హాంకాంగర్లు ఇంకాస్త రెచ్చిపోయారు.

Similar News