తెలంగాణ గవర్నర్ తమిళిసైని అఖిలపక్ష నేతలు కలిశారు. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. వారిని తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు చొరవ చూపాలని గవర్నర్‌ను కోరారు. ఎండీ అఫిడవిట్ భయంకరంగా ఉందని నేతలు పేర్కొన్నారు. ఇంతమంది చనిపోయినా.. సీఎం మనసు కరగడం లేదన్నారు. చర్చలకు పిలిస్తే కార్మికులు సిద్ధమేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వినకపోతే.. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు.