ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమీక్షలో కార్మికుల కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఆదివారం ప్రోఫెసర్ జయశంకర్ చిత్ర పటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమం చేపడుతమన్నారు. ఆదివారం ఎంజీబిఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీ కరణ చేయడం అసాధ్యమని.. కార్మికులు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు అశ్వత్థామరెడ్డి. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసిన తరువాత.. ఆదివారం భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.