Revanth Reddy : సీఎం రేవంత్ సేమ్ ప్లాన్.. పురపోరులో మెజార్టీ సీట్లు వస్తాయా..?
సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కోసం గతంలో ఫాలో అయిన ప్లాన్ ను రిపీట్ చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా జిల్లాల బాట పట్టారు. గ్రామాల ఓట్లర్లను ఆకట్టుకునేలా స్పీచ్ లు ఇచ్చారు. వారిని ఆకట్టుకునేలా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక హామీలు కూడా గుప్పించారు. కాకపోతే డైరెక్టుగా పంచాయతీ ఎన్నికల్లో తమకే ఓటేయాలని కోరలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వచ్చాయి. కాబట్టి వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి అదే ప్లాన్ ను వర్కౌట్ చేసుకోవాలని చూస్తున్నారంట. ఇందులో భాగంగానే నేటి నుంచి మళ్లీ జిల్లాల బాట పట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాకపోతే దీనికి కోడ్ అడ్డంకిగా మారకుండా.. కోడ్ వర్తించని గ్రామాల్లో ఆయన సభలు ప్లాన్ చేసుకుంటున్నారు.
నేడు ఆదిలాబాద్ లో ఆయన పర్యటించారు. ఆ తర్వాత వరుసగా ఇతర జిల్లాల్లోనూ పర్యటించి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లో వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు గానీ.. తనకు కలిసొచ్చిన ఫార్ములాను నమ్ముకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా జిల్లాల బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు.
కానీ వాటిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కానీ ఈ సారి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టాస్కులు ఇచ్చి మరీ ఎక్కువ సీట్లు సాధించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలకు, మంత్రులకు టార్గెట్లు ఫిక్స్ చేసినా సరే.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటి కోసం రంగంలోకి దిగుతున్నారు. మరి ఆయన ప్లాన్ ప్రకారం మెజార్టీ సీట్లు వస్తాయా లేదా అనేది చూడాలి.