హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు తన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్న గవర్నర్.. దేశంలోని ప్రతీ పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు. దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతన్నారు.
తరువాత ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మనది డైనమిక్ రాజ్యాంగమన్నారు. రాజ్యాంగం అనేక మార్పులు, చేర్పులకు లోనైందన్న ఆయన.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు సీఎం కేసీఆర్.