ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ MNS ఓ విభాగం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఆర్మ్డ్డ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ -AFMS వైద్యపరమైన సేవల్ని అందిస్తుంది. ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మీ డెంటల్ కార్ప్స్‌తో పాటు మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ విభాగం కూడా ఉంటుంది. ఈ కోర్సులో 220 మంది అమ్మాయిల్ని చేర్చుకునేందుకు నిర్ణయించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు వేర్వేరు నర్సింగ్ కాలేజీల్లో నాలుగేళ్ల బీఎస్‌సీ నర్సింగ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ తర్వాత మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో సేవల్ని అందించాలి.
దేశంలోని వేర్వేరు కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో సీట్లు ఉంటాయి. పూణేలో 40, కోల్‌కతాలో 30, అశ్వినిలో 40, న్యూఢిల్లీలో 30, లక్నోలో 40, బెంగళూరు 40 సీట్లున్నాయి. నవంబర్ 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు www.joindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 2. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 ఏప్రిల్‌లో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బాటనీ & జువాలజీ), ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50 % మార్కులతో రెగ్యులర్ కోర్సులో 10+2 పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750. దరఖాస్తు చేసే అభ్యర్థులు 1995 అక్టోబర్ 1 నుంచి 2003 సెప్టెంబర్ 30 మధ్య పుట్టినవారై ఉండాలి.